2013 భూ సేకరణ చట్టం అమలు చేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వం
ఇష్టానుసారం బలవంతం భూ సేకరణ ఫలితం లగచర్ల సంఘటన
బొమ్మరాస్పేట్:అగ్నిజ్వాల ప్రతినిధి : 2013 భూ సేకరణ చట్టం అమలు చేయకుండా బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు నష్టం చేసే విధంగా భూ సేకరణ లో అనుసరిస్తున్న విధానం ఫలితం లగచర్ల సంఘటన అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు, మంగళవారం లగచర్ల బాధిత కుటుంబాలను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మూడవత్ ధర్మనాయక్, ఆర్ శ్రీరామ్ నాయక్ ల రాష్ట్ర బృందం పరమర్శించడానికి వెళుతున్న వారిని తుక్కి మెట్లలో అరెస్టు చేసి బొమ్మరాస్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆర్ వెంకట్ రాములు, మూడ్ శోభన్, ఆర్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం భూ సేకరణ విధానం మార్పు చేయాలి అని డిమాండ్ చేశారు. రైతులు శాంతి యుద్ధ ఆందోళన నిర్వహించాలి తప్ప అధికారులుపై భౌతిక దాడి సమర్థనీయం కాదు, అని దాడిని ఖండిస్తుంది అన్నారు. భూమి లేని వారు ఉద్యమం లో ఉన్న రంటు అధికారులు వాదన పసలేనిది. 2013 భూ సేకరణ చట్టం లో వ్యవసాయ కార్మికులు, ప్రజలు నిర్వాసితులే అని పార్లమెంటు చేసిన చట్టం స్పష్టం చేసింది అని అన్నారు. ఫార్మా కంపెనీలు భూ సేకరణ లో ఆ ప్రాంతం ప్రజలు అభిప్రాయం అతి ముఖ్యమైన విషయం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం బలవంతం భూ సేకరణ చేస్తున్నారు. గ్రామ సభలు, ప్రజా అభిప్రాయం సభలు పేరుకు మాత్రమే నిర్వహించి ప్రజల అభ్యంతరాలు కలం పోటు తో ప్రక్కన పెడితే రైతులు భూములు కోల్పోయి జీవనం కోల్పోతున్నారు అని అన్నారు. లగచర్ల సంఘటన ఆధారంగా రైతులపై తప్పుడు కేసులలో ఇరికించి ఉద్యమం నీరుగార్చే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకొని , రైతులు,రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమగ్ర భూ సేకరణ విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, కార్యదర్శి వెంకటయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య, శ్రీనివాస్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మహేందర్, రైతు సంఘం నాయకులు సత్తయ్య, రఘురాం, మల్లేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు