బీసీ సంఘం కానుక.. మట్టి విగ్రహాల పంపిణీ

 

 

మట్టి వినాయకుల పంపిణీలో కందుకూరి రాజ్‌కుమార్

మట్టి వినాయకుల పంపిణీతో ఆదర్శంగా నిలిచిన బీసీ సంఘం

భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ.. మట్టి వినాయకుల పంపిణీ

తాండూరు:manasa news ప్రతినిధి :వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీసీ సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాండూరులోని సర్దార్ పటేల్ చౌక్, విశాల్ మార్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ తో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొని తమ చేతుల మీదుగా భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన వినాయక చవితిని జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి భక్తులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.