రాఖీ కట్టిన సోదరీమణులు.. ఆత్మీయత పంచుకున్న ధారాసింగ్ నాయక్
రాఖీ పండుగ వేళ ధారాసింగ్ నాయక్ నివాసంలో ఆత్మీయ సందడి
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా.. ధారాసింగ్ నాయక్‌కు రాఖీ కట్టిన సోదరీమణులు
తాండూర్:manasa news: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తాండూర్ డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ నివాసంలో రాఖీ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆయన ఆత్మీయ సోదరీమణులు నివాసానికి చేరుకొని ధారాసింగ్ నాయక్‌కు రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారు. అనంతరం స్వీట్లు తినిపించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా ధారాసింగ్ నాయక్‌కు రాఖీ కట్టి తమ మధ్య ఉన్న ఆత్మీయత, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని పంచుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని వారు తెలిపారు.రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాఖీ వేడుకలతో ధారాసింగ్ నాయక్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది.

