బడిలోనే భద్రతకు భంగం!

 

పవిత్రమైన గురు వృత్తికి మచ్చ.. కఠిన చర్యలు తప్పనిసరి

విద్యాలయంలోనే వేధింపులా? రేపటి తరానికి ఏం సందేశం?

ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన గురువులే నిందితులైతే.. బాధ్యత ఎవరిది

తాండూర్ :manasa news ప్రతినిధి :ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యార్థులకు జ్ఞానాన్ని, క్రమశిక్షణను, విలువలను నేర్పాల్సిన పవిత్రమైన ప్రదేశాలు. ముఖ్యంగా ఆడపిల్లలకు భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. అలాంటి విద్యాసంస్థలోనే ఒక విద్యార్థినిపై ఉపాధ్యాయులే లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం అత్యంత ఆందోళనకరమైన విషయం.ఓనమాలు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. విద్యార్థులు వారి నుంచి ఏం నేర్చుకోవాలి? అనే ప్రశ్న తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఉపాధ్యాయుడు విద్యార్థికి కేవలం పాఠ్యాంశాలు మాత్రమే బోధించడు. తన ప్రవర్తనతో సమాజ విలువలను కూడా నేర్పుతాడు. అలాంటి గురువులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అంశం. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. పలువురు అభిప్రాయపడుతున్నారు