ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన వికారాబాద్ జిల్లా, తాండూర్ ప్రైవేట్ టీచర్స్ ఫోరం
తాండూర్, ఆగస్టు 21: manasa news ప్రతినిధి :నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టీపిటీఎఫ్) వికారాబాద్ జిల్లా, తాండూర్ శాఖ ఆధ్వర్యంలో తాండూర్ అంబేద్కర్ కూడలిలో సంతాప సభ నిర్వహించారు. టీపిటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అఖీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య అత్యంత బాధాకరమైన, ఆందోళనకరమైన ఘటన అని పేర్కొన్నారు. విద్యాబోధనకు అంకితమైన ఉపాధ్యాయురాలిపై జరిగిన ఈ దారుణ ఘటనతో మొత్తం ఉపాధ్యాయ సమాజం తీవ్రంగా కలచివేయబడిందన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు అన్నారు. విద్యాసంస్థల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసి, ఉపాధ్యాయులు ఎలాంటి భయాందోళనలు లేకుండా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనకోరారు.అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పలువురు సూచించారు. డ్రగ్స్, గంజాయి, మొబైల్ ఫోన్ల దుర్వినియోగం, సోషల్ మీడియా దుష్ప్రభావం వంటి అంశాలపై పాఠశాలల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, మానవతా దృక్పథం, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.రూపారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, వారికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించి, భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘటనలకు తావులేకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో టీపిటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్‌కుమార్, టీజేఎస్ రాష్ట్ర నాయకులు సోమశంకర్, విద్యావంతుల వేదిక నాయకులు పరియాద రామకృష్ణ, ట్రస్ట్మా తాండూర్ టౌన్ అధ్యక్షులు మోహన్ కృష్ణ గౌడ్, సెక్రటరీ వెంకటేష్, సీపీఐ జిల్లా నాయకులు శ్రీనివాస్, పిడీఎస్యూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఏ.ఆర్. లాజిక్స్ అశోక్, స్వరోజ్ నాయకులు శివకుమార్, విద్యాసంస్థల యజమాని కీర్తి శర్మ పాల్గొన్నారు. అలాగే టీపిటీఎఫ్ ఉపాధ్యాయులు మహమ్మద్ మూఢసిర్, ఖాయమ్, ఖదీర్, సెక్రటరీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అమరిత, రజని,, తన్వీర్, అనిత, కవిత, వినోద్, సతీష్, యూనుస్, శివ, మెహెరాజ్, రాజేశ్వరి, తులసి, అమీనా తదితరులు పాల్గొని రూపారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.బీసీ సంఘం నాయకులు సాయశుకూర్, గడ్డం వెంకటేష్, జోసఫ్, పరమేశ్, షబ్బీర్ తదితరులు కూడా కార్యక్రమానికి హాజరై రూపారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సందర్భంగా రూపారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని టీపిటీఎఫ్ వికారాబాద్ జిల్లా, తాండూర్ నాయకులు డిమాండ్ చేశారు.

