ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలి

అంటువ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి 

ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి  

తాండూర్ మండల్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

తాండూర్, manasa news ప్రతినిధి : గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనకు సర్పంచ్ లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.  గురువారం తాండూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన “మండల స్థాయి సమీక్ష సమావేశం” లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే. సర్పంచ్ లను సన్మానించిన ఎమ్మెల్యే బీఎంఆర్. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఎమ్మెల్యే మాట్లా డుతూ.. గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని.. విద్యుత్, వ్యవసాయం, వైద్యం, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వాహణపై సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామాల్లో వర్షాకాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, సర్పంచ్ లకు ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని.. మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్, స్పెషల్ ఆఫీసర్ సత్తర్, ఎంపీడీవో విశ్వప్రసాద్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్ , ఏఏంసి చైర్మన్ వడ్డే శ్రీనివాస్, గ్రామాలకు చెందిన సర్పంచ్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.