అమావాస్య సందర్భంగా కట్టమైసమ్మ ఆలయంలో అన్నదాన సేవ
కట్టమైసమ్మ సన్నిధిలో అన్నదాన మహోత్సవం
అమావాస్య వేళ.. కట్టమైసమ్మ ఆలయంలో ఘన అన్నదానం!
ఆదర్శనగర్ పాతకుంటలో ఘనంగా అన్నదానం
తాండూర్: manasa news: ఆదర్శనగర్ పాతకుంటలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమావాస్య సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలమ్ పల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు మానవతా విలువలను పెంపొందిస్తాయని పలువురు కొనియాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాన్ని అల్లంపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు వర్త్య విఠల్ నాయక్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సేవలో ముందుండే వారిని ఆయన అభినందించారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ అన్నదానం భక్తుల్లో ఆనందాన్ని నింపింది. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న నిర్వాహకులను స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు. :::

