నా భూమి నాకే కావాలి..! బాలమ్మ ఆవేదన
తప్పుడు పత్రాలతో భూమి పట్టా మార్పిడికి యత్నం.. విచారణ కోరిన దళిత మోముల బాలమ్మ
భూమి కోసం భారీ స్కెచ్..! బాలమ్మ సంచలన ఆరోపణలు
పెద్దేముల్, :manasa news ప్రతినిధి
తన భర్త పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలు, రికార్డుల ఆధారంగా ఇతరుల పేర్లకు పట్టా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్దేముల్ మండలానికి చెందిన మోముల బాలమ్మ ఆరోపించారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తన భర్త మోముల రాంచెంద్రి (చెంద్రప్ప) పేరిట ఉన్న సర్వే నంబర్ 165/62లో ఎకరం 1-33 గుంటలు, సర్వే నంబర్ 450/3లో ఎకరం 1-20 గుంటల భూమికి సంబంధించి వివాదం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తకు సంబంధించిన భూమిపై ఇతరులు హక్కులు కల్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తాను తన భర్తతో కలిసి ఎన్నో సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించామని, తన భర్త 12-01-2026న మృతి చెందిన అనంతరం భూమికి సంబంధించిన వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించామని బాలమ్మ తెలిపారు.
భూమికి సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు తదితరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె అధికారులను కోరారు. తప్పుడు పత్రాలు లేదా అక్రమ పట్టా మార్పిడి జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తన హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

