ప్రజా సంఘాల ఆందోళన హెచ్చరిక

 

బీజేపీ నేత కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రజా సంఘాలు

చట్టం ముందు అందరూ సమానమే – సాయి భగీరథ్‌పై వెంటనే చర్యలు తీసుకోండి

బాధిత యువతి కుటుంబానికి రక్షణ కల్పించాలి : సిఐటియు, ప్రజా సంఘాలు

మైనర్ బాలిక కేసులో సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేయాలి

బండి సాయి భగీరథ్‌ను అరెస్టు చేయాలి : ప్రజా సంఘాల డిమాండ్

తాండూర్:manasa news ప్రతినిధి తాండూర్ సిఐటియు, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి మరియు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్, సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్‌పై వెంటనే పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోరారు.చట్టం ముందు అందరూ సమానులనే సూత్రంతో పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని వారు అన్నారు. తన తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారనే అండదండలతో సాయి భగీరథ్ విద్యాసంస్థల్లో ర్యాగింగ్, భౌతిక దాడులు, మద్యం మత్తులో విద్యార్థులపై అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.మైనర్ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత కేసును తప్పుదోవ పట్టించేందుకు హనీ ట్రాప్ వంటి ఆరోపణలు చేస్తూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి వేధింపులకు గురిచేశారని బాధిత యువతి తన తల్లితో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, గంటల తరబడి నిరీక్షింపజేసి ఫిర్యాదు స్వీకరించారని తెలిపారు.“బేటీ బచావో – బేటీ పడావో” వంటి నినాదాలు ఇచ్చే బీజేపీ నాయకత్వం మహిళల పట్ల చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. కేంద్ర హోంశాఖ ప్రభావంతో రాష్ట్ర పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.బాధిత యువతికి ప్రాణహాని ఉందని, ఆమె కుటుంబానికి తక్షణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గ తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఇంచార్జ్ ఎండి సాదిక్, ప్రజా సంఘాల నాయకులు వెంకటయ్య, బలరాం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు