కోటిమంది మహిళలను కోటిశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

కోటిమంది మహిళలను కోటిశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

 

తాండూరు, బషీరాబాద్ మండలాలలో ప్రజా పాలన విజయెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.

 

అట్టహాసంగా పనుల జాతర కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో MGNREGS ద్వారా నూతన పనులకు శ్రీకారం.

తాండూర్ :అగ్ని జ్వాలా ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన విజయెత్సవాల్లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో గోనూర్, మంతట్టి గ్రామాలలో సీసీ రోడ్డు, పానాది రోడ్, గ్రామ పంచాయతీ భవన పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
మంతటి గ్రామంలో మహిళ సమాఖ్య ద్వారా స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటును ఇస్తూ దాదాపు 17 లక్షల రూపాయల విలువ గల 5 యూనిట్లను ప్రారంభించడం జరిగింది..
ఈ సందర్భంగా మహిళ సంఘం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గత పదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళ సంఘాలను చిన్న చూపు చూడటం జరిగిందని, మన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పావులా వడ్డీ రుణాలు తిరిగి ప్రారంభించడం జరిగిందని, ఇందిరా మహిళ శక్తి ద్వారా మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
అనంతరం మహిళ సంఘం సభ్యులకు మంజూరైన కోటి ఇరవై లక్షల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను సంఘం సభ్యులకు అందించడంతో పాటు రంగోలి పోటీలలో విజేతలుగా నిల్చిన సభ్యులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *