ప్రజలతో కలిసి కొత్త ప్రయాణం – యువతరం పార్టీ ఆహ్వానం
మావోయిస్టు మాజీ నేతలకు యువతరం పార్టీ స్వాగతం
రాజ్యాంగబద్ధ పోరాటానికి ముందుకు రండి – యువతరం పార్టీ
ప్రజాస్వామ్య మార్గంలోకి రండి – గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం
లొంగిపోయిన మాజీ మావోయిస్టులకు యువతరం పార్టీ పిలుపు
భద్రాచలం ,manasa news ప్రతినిధి :భద్రాచలం లో లొంగిపోయి సామాన్య జీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు నాయకులు మరియు క్యాడర్ సభ్యులకు యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం పలికారు. మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న, తిప్పిరి తిరుపతి, మల్ల రాజారెడ్డి, బడే చొక్కా రావు, నూనె నరసింహారెడ్డి, ఎర్రాల్, బర్సే దేవా, చంద్రన్న, బండి ప్రకాష్, కంకణాల రాజారెడ్డి, సుజాత, తార తదితరులు ఇటీవల లొంగిపోయిన నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు.గత కొన్ని దశాబ్దాలుగా పీడిత ప్రజల సమస్యలపై పోరాటం చేసిన వారు ప్రస్తుతం రాజ్యాంగబద్ధ మార్గంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమవడం సముచిత నిర్ణయమని గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలతో కలిసి, చట్టపరమైన విధానాల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా యువతరం పార్టీని విస్తరించి, సామాజిక న్యాయం మరియు అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు పోట్రూ ప్రవీణ్ కుమార్ మరియు రాష్ట్ర నాయకులు గుగులోత్ బాబు, అజ్మీరా నరేష్ నాయక్, గడ్డం రాజేష్, సురేష్ తదితరులు కూడా ఈ ఆహ్వానానికి మద్దతు తెలిపారు.

