“హామీలు నెరవేర్చండి!” అంతే

 

ఆరు గ్యారంటీలకు  మంగళం పలికిన కాంగ్రెస్ పార్టీ కాదా 

36 వార్డుల అభివృద్ధి కి కట్టుబడి పని చేయాలి 

తాండూర్ అభివృద్ధి ఎక్కడ? ప్రతిపక్షాల ప్రశ్న”

 “హామీలు అమలు చేయండి… మాటలు ఆపండి”

కాంగ్రెస్ హామీలు ఎక్కడ? టీఆర్ఎస్ కౌంటర్”

హామీలు నెరవేర్చండి… అభివృద్ధి చూపండి!”

తాండూర్,manasa news ప్రతినిధి :తాండూర్ రాజకీయాల్లో వాస్తవాలను విస్మరించి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకుడు రాజు గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు.మీరు కౌంటింగ్ లోపలికి వెళ్లినందుకే మేము అడ్డుకున్నాం మా తప్పు ఉంటే న్యాయపరంగా ఎదుర్కొంటాం,” అని రాజు గౌడ్ స్పష్టం చేశారు.ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ —19 సీట్లు గెలిచిన పార్టీకి 21 వేల ఓట్లు వచ్చాయని, 12 సీట్లు గెలిచిన తమ పార్టీకి 18 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. కేవలం ఓట్ల తేడా తక్కువగా ఉందని, నైతిక విజయం తమదేనని పేర్కొన్నారు.“ముస్లింలకు మోసం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే,” అని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తాండూర్ అభివృద్ధికి రూ.7 కోట్లు 50 లక్షలు తీసుకువచ్చామని, మసీదులు, ఇద్గాలు మరియు ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు.గత ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ — టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ 8 సీట్లు, మరొకసారి 4 సీట్లు మాత్రమే గెలిచిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ 12 సీట్లు సాధించడం ప్రజాభిమానానికి నిదర్శనమని చెప్పారు.లోకల్-నాన్ లోకల్ అంశంపై స్పందిస్తూ — “రోహిత్ రెడ్డి లోకల్ కాదా? మనోహర్ రెడ్డి నాన్ లోకల్ కాదా? చెన్నారెడ్డి, మహేందర్ రెడ్డి, మాణిక్ రావు నాన్ లోకల్ కాదా?” అంటూ ప్రశ్నించారు. లోకల్ అని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు.చివరిగా, ఇంటోడు ఇంటోడే బయటోడు బయటోడే అంటూ తన విమర్శలను ఘాటుగా ముగించారు.ఇదే సందర్భంలో పట్లోళ్ల నర్సింహులు మాట్లాడుతూ —తాండూర్ పట్టణ అభివృద్ధిపై రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేయాలని సూచించారు.“వార్డు కు రూ.2 వేల ఇల్లు ఇస్తామని చెప్పారు. ముందుగా ఆ హామీని అమలు చేయాలి,” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసి తాండూర్ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని కోరారు.తాండూర్ ప్రజలు పదవి ఇచ్చింది వ్యక్తిగత విమర్శల కోసం కాదని, పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. 36 వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ తాండూర్ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుందని తాండూర్ ప్రజల మేలు కోసం ప్రతిపక్షంగా అభివృద్ధిని కోరుకుంటుంద ని పట్లోళ్ల నర్సిములు అన్నారు పదవిలో ఉన్నా లేకున్నా తాండూర్ అభివృద్దే రోహిత్ రెడ్డి ఆశయమని గెలుపు కంటే ఆశయం ముఖ్యమని మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ స్పష్టం చేశారు