యువనాయకత్వానికి నిదర్శనం… ప్రజలతోనే ప్రయాణం శిల్పా రాజేందర్ పటేల్
* ఎన్నికల ఫలితాలకతీతంగా ప్రజల కోసం పోరాటం… శిల్పా రాజేందర్ పటేల్ హామీ
* ఓటమిలోనూ సేవా సంకల్పం… ప్రజల మనసులు గెలిచిన శిల్పా రాజేందర్ పటేల్
తాండూర్,manasa news ప్రతినిధి :తాండూరు పట్టణంలోని 32వ వార్డు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ యువనాయకులు శిల్పా రాజేందర్ పటేల్ తెలిపారు. సీతారాంపేట్ పటేల్ గార్డెన్ పరిధిలో శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మనసుల్లో గెలిచానని ఆమె పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఓటరుకు ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధే తన లక్ష్యమని, ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు.
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో 32వ వార్డుకు అవసరమైన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.

