బానాపూర్‌లో బొడ్రాయి ప్రతిష్టాపన – అన్నదాన కార్యక్రమాలు
మూడు రోజులపాటు బానాపూర్‌లో భక్తి సందడి
గ్రామ శ్రేయస్సు కోసం బానాపూర్‌లో ఆధ్యాత్మిక వేడుకలు
యాలల. manasa news ప్రతినిధి :వికారాబాద్ జిల్లా యాలాల మండలం బానాపూర్ గ్రామంలో మూడు రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రెండు నాభిశిల బొడ్రాయి ప్రతిష్టాపనలు మరియు హనుమాన్ ఆలయం ఎదురుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేపట్టారు.
నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ప్రతిష్టాపనలు నిర్వహించగా, గ్రామ ప్రజలు మరో లక్ష రూపాయలు చందాగా సమకూర్చారు. మూడు రోజులపాటు పూజలు, పోతురాజుల విన్యాసాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తి వాతావరణం నెలకొల్పారు.
గ్రామ శ్రేయస్సు, రక్షణ కోసం నాభిశిల ప్రతిష్టాపన చేసినట్లు విఠల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినావత్ శంకర్ నాయక్, కౌన్సిలర్ సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ బాబ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

