*బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరం
* పర్వత్ పల్లి అంగన్వాడి టీచర్ బాలమణి
* ప్రపంచంలో కల్తీ లేనివి తల్లి ప్రేమ, తల్లిపాలే
* తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిణీలకు , బాలింతలకు తెలియజేసిన
* పర్వత్ పల్లి అంగన్వాడి కేంద్రం టీచర్ బాలమణి
బషీరాబాద్గ్ అగ్ని జ్వాల ప్రతినిధి
తాండూర్, ప్రతి యేడాది ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ సందర్భంగా శనివారం బషీరాబాద్ మండలంలోని పర్వత్ పల్లి అంగన్వాడి కేంద్రంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. మేరకు పర్వత్ పల్లి అంగన్వాడి టీచర్ బాలమణి మాట్లాడుతూ… నవజాత శిశువుకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని గర్భిణీలకు, బాలింతలకు సూచించారు. ఆహార పదార్థాల సేకరణలో ప్రపంచమంతా కల్తీ వలయంలో ప్రయాణిస్తుండగా , ప్రపంచంలో కల్తీ లేనివి తల్లి ప్రేమ, తల్లిపాలేనని తెలియజేశారు. శిశువు శారీరకంగా, మానసికంగా, నైతికంగా, సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే ముర్రుపాలు అందించడంతోనే సాధ్యమన్నారు. బిడ్డకు అందించే ముర్రుపాలలో మాంసాకృతులు , రోగ నిరోధక శక్తి, విటమిన్స్ అధికంగా ఉండడంతో శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయని గర్భిణీలకు, బాలింతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) సూపర్వైజర్ జ్యోతి, సహాయక నర్సింగ్ మిడ్ వైఫరీ (ఏఎన్ఎం) సైదమ్మ, ఆశా వర్కర్, గర్భిణీలు, బాలింతలు , ఆయాలు చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.