*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకుంటుంది..
*గ్యారెంటీల పేరుతో సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు..
*-బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగల శ్రీశైల్ రెడ్డి గారు..
అగ్నిజాల ప్రతినిధి : తాండూర్
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకుని తన సత్తా చాటుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగల శ్రీశైల్ రెడ్డి అన్నారు. ఈరోజు బషీరాబాద్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి(రాజు) ఆధ్వర్యంలో జరిగిన మండల పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన దిమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గ్రామాల్లోకి కాంగ్రెస్ నాయకులు వస్తే ప్రజలే వారిని నిలదీసి తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మునీందర్ రెడ్డి, రంగారెడ్డి, అనంతయ్య, రవీందర్ సింగ్, పాండురంగారెడ్డి, శివరాం నాయక్, జయమ్మ, మధుసూదన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాగేంద్రయ్య, రజాక్ కృష్ణ, సునీల్ ప్రసాద్ మండల యూత్ ప్రెసిడెంట్ తాహెర్ వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.