బీసీ కులగణన లెక్కలను ప్రజల ముందు ఉంచండి

 

బీసీ కులగణన లెక్కలను ప్రజల ముందు ఉంచండి

చలసాని వెంకట్ యాదవ్

 బార్ కౌన్సిల్ మెంబర్ తెలంగాణ

42% రిజర్వేషన్ ను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తక్షణమేఅమలు చేయాలి 

కందుకూరి రాజ్ కుమార్

 బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు

అగ్ని జ్వాలా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా

నేడు అనగా తేదీ 28 మే 2025 నాడు తాండూరు పట్టణంలో న్యాయవాది కే గోపాల్ గారి నివాసంలో ఏర్పాటుచేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ చలసాని వెంకట్ యాదవ్ గారు మాట్లాడుతూ దేశంలో మరియు రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు వారి వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు తాండూరు కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయాలని అట్లాగే గతంలో జరిగిన కుల జన గణన లెక్కలను వాటి వివరాలను ప్రజల ముందు ఉంచి ప్రజలకు ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అని వారు పునరుద్ఘాటించారు. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి జనాభా దామాషా ప్రకారం సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలలో వారి వాటా ఉండాలి అని వారు తెలియజేశారు. రానున్న రోజుల్లో సబండవర్గాలన్నీ కలుపుకొని బహుజనులంతా ఏకమై ఐకమత్యాన్ని చాటుతూ రాజ్యాధికారాన్ని సాధించాలని వారు ఆకాంక్షించారు ఇట్టి కార్యక్రమంలో తాండూరు న్యాయవాది కే గోపాల్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షూకూర్ ,బీసీ సంఘం నాయకులు యాదయ్య యాదవ్, బీసీ సంఘం నాయకులు అరుణ్ రాజ్ న్యాయవాది జిలాని తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *