ఈనెల 29న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పననే 

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి లక్ష్యం

ఈనెల 29న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

ఇస్మాయిల్ కురేసి కోట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు

 

అగ్నిజాల ప్రతినిధి : వికారాబాద్ జిల్లా

నియోజకవర్గం లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పననే తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి లక్ష్యం అని కోటపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఇస్మాయిల్ కురేసి అన్నారు. తాండూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప సువర్ణ అవకాశం గా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ లో ఈనెల 29న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే మెగా జాబ్ మేళాను తాండూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోటపల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఇస్మాయిల్ కురేసి అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాను తెలంగాణ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈ జీ ఎం ఎం) సహకారంతో 50 కంపెనీలతో దాదాపుగా పది (10,000) వేల ఉద్యోగాలు కల్పిస్తున్నారని అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో విద్యా అర్హతగా పది,ఇంటర్,డిగ్రీ , పీజీ, బిటెక్ చదువుకున్న నిరుద్యోగులకు మార్కెటింగ్, ఐటీ, బ్యాంకింగ్, నర్సింగ్ తదితర రంగాలలో ఉద్యోగం కల్పిస్తారని తెలియజేశారు. ఈ అవకాశంతో నిరుద్యోగులు ఆయా రంగాలలో ఉద్యోగం పొంది ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. ఈ మంచి అవకాశాన్ని తాండూర్ నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లో యువత ముందుకు వచ్చి ‌వారికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. ఇట్టి జాబ్ మేళా నిర్వహించిన జనహృదయనేత తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి  కి ధన్యవాదాలు అని   కోట్ పల్లి కాంగ్రెస్ యువ నాయకులు ఇస్మాయిల్ కురేసి అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *