రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి
అగ్ని జ్వాలా ప్రతినిధి:వికారాబాద్ జిల్లా
తాండూర్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప కాలనీ లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లాల మరియు తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి మరియు మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి, భారతదేశ పురోభివృద్ధికి తనదైన శైలిలో సేవలందించిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు కృషి చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లాల మాజీ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవి , మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, వెంకన్న గౌడ్ , రాము , తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కచ్చి ఓవైస్ సీనియర్ నాయకులు బాతుల వెంకటేష్ , జిలాని, ఇనాయత్ పాషా, సయ్యద్ ఖాజీ, అఖిల్ బాబా, యూసుఫ్, సయ్యద్ గౌస్ లాల, రిజ్వానా బేగం, బాబ, అనస్, తదితరులు పాల్గొన్నారు.

