బైపాస్ రింగ్ రోడ్డుబాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సబ్ కలెక్టర్ వినతి పత్రం సిపిఎం

బైపాస్ రింగ్ రోడ్డు కోసం ప్రజల నుండి ప్రభుత్వం ప్లాట్ల జాగాలు తీసుకొని ప్రభుత్వం భూ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సబ్ కలెక్టర్ వినతి పత్రం సిపిఎం

అగ్నిజ్వల ప్రతినిధి: తాండూర్

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో బైపాస్ రోడ్డు కోసం పేద ప్రజల నుంచి ప్రభుత్వం ప్లాట్ల జాగాలు తీసుకొని నష్టపరిహారం ఎక్కువ చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది భూ బాధితులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు అని ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల నుంచి అభివృద్ధి పనుల చేస్తున్నమని గొప్పలు చెప్పుకుంటూ ప్రజల దగ్గర నుండి ప్లాట్ల స్థలాలు అక్రమంగా దౌర్జన్యంగా తీసుకొని తాండూర్ లో బైపాస్ రింగ్ రోడ్ కోసం కోకాట్ అంతారం చెంగోల్ మిగతా గ్రామాల ప్రజల నుండి ప్లాట్ల జాగాలు తీసుకొని నష్టపరిహారం ఇవ్వకుండా భూ బాధితులకు అన్యాయం చేస్తుంది గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజల నుండి భూములు తీసుకొని బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యానికి గురి చేసినారు అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూ బాధితులకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా భూములు తీసుకొని కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా భూములు, ప్లాట్లు కోల్పోయిన వారిని ప్రభుత్వాలు మోసం చేస్తూ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వారిని అధికారులు పట్టించుకోకుండా ప్రజలకు డబ్బులు చెల్లించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తూ భూ బాధితులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ అధికారుల జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్లాట్లు కోల్పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డిమాండ్ చేశారు భూ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించలేక పొతే ప్లాట్లు కోల్పోయిన బాధితులు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎం హెచ్ పి ఎస్ తాండూర్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ సాదిక్ సిపిఎం నాయకులు బాలస్వామి సురేష్ ప్లాట్ల బాధితులు యాసిన్ రమేష్ శ్రీనివాస్ బాల్ రెడ్డి వెంకటమ్మ రాజు నర్సింలు వెంకటేష్ అశోక్ అనంతమ్మ శేఖర్ దితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *