బి.ఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారు

బి.ఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ

12 ఫీట్లభారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ 

అగ్నిజ్వలప్రతినిధి: తాండూర్

ప్రపంచ మేధావి,బారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ అందరివాడని,ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కిరణ్ అన్నారు .సమసమాజ నిర్మాణానికి, స్వేచ్ఛ,సమానత్వం పెంపొందించడానికి అంబెడ్కర్ సిద్దాంతాలుఉపయోగపడతాయన్నారు. బారత తొలి న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సేవలందించిన మహోన్నత వ్యక్తని కొనియాడారు. ఈనెల 7వ తేదీన బుధవారం ఉదయం 11 గంటలకు వికారాబాద్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం నిర్వ హించనున్నట్లు డివిఎంసి వికా రాబాద్ జిల్లా సభ్యులు కిరణ్ లిపారు. ఎన్నెపల్లి అంబేద్కర్ చౌరస్తా వికారాబాద్ లో నిర్వ హించేే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమానికి తాండూర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లి, కార్యక్రమాన్ని జయప్రదం చేయనున్నట్లు కిరణ్ మరియూ మయూర్  బి శ్రీను  సలాం సర్దార్ శ్రీనివాస్ రెడ్డి  సంఘం అధ్యక్షులు పల్లె జనార్దన్ . స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *