మే 15న హైదరాబాద్ లో మత్స్యకారుల మహాధర్నాని జయప్రదం చేయాలి
— గొల్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని కూల్చి వేయండి
— లేకుంటే సంఘం ఆధ్వర్యంలో కూల్చివేస్తాం
—సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ స్పష్టీకరణ..
అగ్నిజాల ప్రతినిధి : తాండూర్
తాండూర్: మత్స్యకార్మిక సమాఖ్య దేశవ్యాప్తంగా మత్స్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మే 15, 2025 తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మత్స్యకారులు మహాధర్నాని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ పిలుపునిచ్చారు. ఈ సంద ర్బంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పీపుల్స్ కళాశాలలో నియోజక వర్గ మసకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మత్స్యకారులకు వృత్తి రక్షణ, ఉపాధి, జీవిత భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మత్స్యకారులు సరియైన ఆర్థిక అభివృద్ధి లేక పేదరికంతో అనేక ఇబ్బందులు పడుతూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కేటాయిస్తున్న లక్షల కోట్ల బడ్జెట్లో బడా పెట్టుబడిదారులు, సంపన్న వర్గాలకి రాయితీలు, ఫలాలు అందుతున్నాయని, మత్స్య కారులకు బడ్జెట్ కేటా యింపులో న్యాయం దక్కట్లేదని అన్నారు. అదేవిదంగా తాండూర్ పట్టణంలోని గొల్ల చెరువు తూములు, అలుగు లని రాష్ట్ర అధ్యక్షులు గోరెం కల నర్సింహ్మ ఆధ్వర్యంలో తాండూర్ మత్సకారులు సం దర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. దింతో రాష్ట్ర అధ్యక్షులు నర్సింహా నీటిపారుదల శాఖ అధికారులతో ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెరువులో నిర్మాణం చేపడుతున్న పనులను నిలిపి వేయాలని పేర్కొన్నారు. చెరువులో ఉన్నటువంటి పూడికతీత, గుర్రపు డెక్క, పెన్సింగ్ తదితర పనులని నిర్వహించాలని అన్నారు. లేనిపక్షంలో మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో తామే కూల్చివేయడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. తాండూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చెరువులను కాపాడాల్సిన బాధ్యతఅధికార యంత్రాంగం పై ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య కారుల సంఘం అధ్యక్షులు అబ్బనీ బసయ్య, తాండూర్ పట్టణ మత్స్యకార సంఘం అధ్యక్షులు నరహరి, నియో జవర్గ అధ్యక్షులు జనార్ధన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి రాములు, మంతటి రాజు, జి శివకుమార్, ఉప్పరి నర్సిములు, పల్లె రాములు, జంగం చంద్రయ్య,లాలప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

