గంగోత్రి విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఉన్నారని మధుప్రియ కొనియాడారు
సింగర్ మధుప్రియ రాము రాథోడ్ వారి బృందం హాజరయ్యారు,
గంగోత్రి విద్యాలయం లో ఆటపాటలతో అలరించిన మధుప్రియ
అగ్నిజాల ప్రతినిధి : తాండూర్
వికారాబాద్ జిల్లా తాండూర్ మండల గంగోత్రి పాఠశాలలో ఘనంగా గంగోత్రి విద్యాలయ స్కూల్లో అన్యువల్ డే సెలబ్రేషన్స్ తాండూర్ పట్టణంలోని గంగోత్రి విద్యాలయ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సింగర్ మధుప్రియ రాము రాథోడ్ వారి బృందం హాజరయ్యారు, వారి రాకతో గంగోత్రి విద్యలయ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్కూల్ విద్యార్థి విద్యార్థినిలు వారి ఆటపాటలతో ఇటు మధుప్రియ గానం అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులను ఆట పాటలతో అలరించారు గంగోత్రి విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఉన్నారని కొనియాడారు కార్యక్రమంలో మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

