19 నుండి నిరవధిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది సిఐటియు పిలుపు

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఏప్రిల్ 19 నుండి నిరవధిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది సిఐటియు పిలుపు

అగ్నిజ్వల ప్రతినిధి: తాండూర్

బషీరాబాద్ :తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) ఆధ్వర్యంలో బషీరాబాద్ లో అధికారులకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఏప్రిల్ 19 నుండి సమ్మె గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని అనేక పోరాటాల సందర్భంగా వేతనాలు చెల్లిస్తున్నారు తప్ప ఇంకను గతంలో బకాయి పడిన డిసెంబర్ లోపు ఆరు నెలల వేతనాలు చెల్లించాలని గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని 51 జీవో సవరించాలని మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని కరోబార్ బిల్ కలెక్టర్లకుప్రత్యేక స్టేటస్ కల్పించాలని ఆన్లైన్లో నమోదు గానీ సిబ్బందిని నమోదు చేసి వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కలిపించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ పంచాయతీరాజు కమిషనర్ హైదరాబాద్ గారికి మార్చి 26నసమ్మె నోటీసు ఇవ్వడం జరిగినది పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కారం చేయాలని లేనియెడల ఏప్రిల్ 19 తర్వాత ఏ రోజు నుండైనా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఉద్యోగ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళుతున్నామని జిల్లాలో ఏప్రిల్ 03 నజిల్లా పంచాయతీ అధికారి గారికి సమ్మె నోటిస్ ఇవ్వాలని మరియు ప్రతి మండల కేంద్రంలో బకాయి వేతనాల జాప్యాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 4.వ తేది లేదా 7 వతేదీలలో ధర్నాలు నిర్వహించి సమ్మె నోటిస్ ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల సిఐటియు నాయకులు మానెప్ప సురేష్ గ్రామపంచాయతీ కార్మికులు శామప్ప చందు నరేష్ లక్ష్మీ బీమమ్మ చంద్రప్ప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *