ఘనంగా మధుసూదన్ రావు పదవి విరమణ
మధుసూదన్ రెడ్డి సేవలు మరువలేనివి
ఆత్మీయ అభినందన సత్కార సభ
—చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
—ఆత్మీయ సభలో మధుసూదన్ రావుని ఘనంగా
సన్మానించిన స్నేహితులు, పలు పార్టీల నాయకులు..
తాండూర్ అగ్నిజాల ప్రతినిధి:
తాండూర్:సమాజంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు వ్యవస్థలో 34 ఏళ్ళ పాటు సుదీర్ఘ సర్వీస్ తోదేశ రక్షణలో ,సమాజ పరిరక్షణలోఅత్యున్నత పదవి అలంకరించి వ్యవస్థకే తాండూర్ తేజం , అడిషనల్ ఎస్పీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నల్గొండ ,జి.మధుసూదన్ రావు వన్నె తెచ్చారని పలువురు ప్రశంషించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోనిశ్రీ కన్వెన్షన్ హాల్లో మధుసూదన్ రావుపదవి విరమణ ఆత్మీయ అభినందన సత్కార సభ తాండూరు మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మధుసూదన్ రావు మాట్లాడుతూ.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళితే విజయం వరిస్తుందని తెలిపారు. స్నేహితుల మధ్యన అభినందన సత్కార సభ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. మరొకవైపు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బావోద్వేగానికి లోనయ్యారు.అంతకుముందుసమావేశంలో పలువురు మాట్లాదుతూ.. పోలీస్ అధికారిగా వివిధ హోదాలలో మధుసూదన్ రావు చక్కటి సేవలు అందించారని కొనియాడారు.విధి నిర్వహణలో తనదైన ముద్రవేశారని..పలు హోదాలలో పనిచేసి అందరి మన్ననలు పొందారని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, సర్దార్ ఖాన్, రాజ్ కుమార్,కరణం పురుషోత్తం రావు, బోయిని చంద్రశేఖర్, షూకూర్, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

