జుంటుపల్లి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు
–తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
అగ్ని జ్వాల ప్రతినిధి తాండూర్
తాండూర్(యాలాల) :వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం జుంటుపల్లి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక నాయకులు, అధికారులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం , జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

