పేద ప్రజలకు నాణ్యమైన భోజనంతో కడుపునింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

  1. పేద ప్రజలకు నాణ్యమైన భోజనంతో కడుపునింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

 

రైతులకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం కాంగ్రెస్సేనని అన్నారు

అగ్ని జ్వాలా ప్రతినిధి : తాండూర్

వికారాబాద్ జిల్లా యాలాల మండలం గిర్జాపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలోని ఎక్కడలేని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యంతో అన్నం పెట్టేందుకు చేపట్టిన కార్యక్రమం అన్నారు సన్న ఒడ్లు పండించే రైతులకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం కాంగ్రెస్సేనని అన్నారు అదేవిధంగా రుణమాఫీ రైతు భరోసా వంటి కార్యక్రమాలు చేపట్టి రైతులను ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు తీసుకొని రైతులు మరియు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో   నాయకులు కాలాల్  చంద్రశేఖర్ గౌడ్  జనార్దన్ రెడ్డి బోనస్ రాములు రామచంద్రయ్య గౌడ్ బుద్దారం హన్మంత్ రెడ్డి పి లక్ష్మయ్య వెంకట్ రెడ్డి బి వెంకట్ పి. లక్షమయ్యా వెంకట్ రెడ్డి  ఎం సురేష్ ఆర్ అనంతయ్య ఎం బాజరప్ప వి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *