విప్లవవీరుడుకమ్యూనిస్టుయోధుడు దొడ్డికొమురయ్య

భూస్వాములు, దొరల అరాచకాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు విరోచితమైన పోరాటం దొడ్డికొమురయ్య

విప్లవవీరుడుకమ్యూనిస్టుయోధుడు దొడ్డికొమురయ్య

దొరల ఆగడాలను అరికట్టించడంలో ముందు వరసలో ఉండి పోరాటం చేసిన విప్లవ వీరుడు

వారి స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పేద ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం ఉదృతం చేయాలని సిపిఎం పిలుపు నిచ్చారు

అగ్నిజ్వల ప్రతినిధి:తాండూర్

తాండూర్ సిపిఎం పార్టీ ఆధ్వర్యం లో తాండూరు పట్టణంలో దొడ్డి కొమరయ్య విగ్రహం దగ్గర జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు… తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం దొడ్డి కొమరయ్య సాధారణ గొర్రెల పెంపకం దారుల కుటుంబంలో జన్మించినప్పటికీ దొరల, భూస్వాముల అరాచకాలను తట్టుకోలేక యువతి, యువకులను ఏకం చేసి వారి ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేశారన్నారు. అణిచివేతకు వెట్టిచాకిరి, దోపిడీకి పీడనాలకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టుకొని విసునూరు దొరల ఆగడాలను అరికట్టించడంలో ముందు వరసలో ఉండి పోరాటం చేసిన విప్లవ వీరుడు కమ్యూనిస్టు యోధుడు దొడ్డి కొమరయ్య అని తెలిపారు. విసునూరు దేశ్ముఖ్ లు మనుషులను వెట్టి చాకిరీ చేయించడంలో, వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టే వారని వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచి నిర్మూలించగలిగిన మహా వ్యక్తి దొడ్డి కొమరయ్య అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలు, భూస్వాముల తుపాకీ తూటాలకు బలి అయిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తిగా తీసుకొని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుండి భూమి లాక్కోవడం హైదరాబాద్ లో విశ్వవిద్యాలయం యూనివర్సిటీ భూములు 400 ఎకరాల భూమిని కార్పొరేట్లకు పెట్టుబడుదారులకు విలువైన భూములను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనిచేయాలనీ అక్రమ కేసులతో అరెస్టులతో ప్రజా ఉద్యమాలని ప్రభుత్వాలు ఆపలేవని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై అక్రమ కేసులు లాటి చార్జి చేయడానితీవ్రంగా ఖండించారు తెలంగాణ ప్రజలందరు మేల్కోవాలని హైదరాబాద్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలని మేధావులు ప్రజలు విద్యార్థులు యువకులు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు సురేష్ మల్లప్ప నర్సిములు వెంకటప్ప బిచ్చప్ప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *