17వ వార్డ్ లో..
–పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యేమనోహర్ రెడ్డి
–ప్రజా పాలనలో భాగంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పేదలకు సన్న బియ్యం పంపిణీ చేశారు
ఈ పథకాన్ని ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు
అగ్ని జ్వాల ప్రతినిధి : తాండూర్
తాండూర్: ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా రేషన్ లబ్ధిదారులకి నాణ్యమైన బియ్యాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 17వ వార్డ్ పాత తాండూర్ లో ప్రజా పాలనలో భాగంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పేదలకు సన్న బియ్యం పంపిణీ చేశారు.ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం అని అన్నారు. ఈ పథకాన్ని ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలు అవ్వాలని.. సన్న బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదన్నారు. ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి ప్రజలందరూ కలిసి భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, తహసీల్దార్ తారాసింగ్,డీలర్ మొయిజ్ ఖాన్, ప్రజాప్రతినిదులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

