ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ 

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ 

 

రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనదని స్నేహంతో ఎలా ఉండాలన్నదే రంజాన్ అని తెలిపారు 

తాండూర్ అగ్ని జ్వాల ప్రతినిధి 

తాండూర్ పట్టణంలోని ఈద్గా దగ్గర రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు. అనంతరం,ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ,ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు (ఈద్ – ఉల్ – పితర్) రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదర సోదరీమణులంతా పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని,పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు..అల్లా ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా పాడిపంటలు, సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు..

గత కెసిఆర్ ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు ప్రతి గ్రామంలో షాది ఖాన,దర్గాలకు మరియు ఈద్గా నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *