రంజాన్ సందర్భంగా సుల్తాన్ విందుకు హాజరైన చీప్ చీప్ మహేందర్ రెడ్డి
రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని విప్ మహేందర్ రెడ్డి అన్నారు
తాండూర్ అగ్నిజాల ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి రంజాన్ మాసం పునస్కరించుకొని ముస్లిం సోదరుల ప్రార్థనలలో పాల్గొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అభిమాని తాండూరు పట్టణ ప్రముఖ కూరగాయల వ్యాపారి సుల్తాన్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సోదర భావంతో శాంతియుత వాతావరణంలో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని అన్నారు.

