రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూర్ అగ్నిజాల ప్రతినిధి
తాండూర్ : రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక అని చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ లో సోమవారం ఖాంజపూర్ గుట్ట సమీపంలో గల ఆఇలేహదిస్ ఈద్గాలో, చెన్గెస్ పూర్ రోడ్ సమీపంలో గల ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, అనంతరం ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మత సామరస్యాన్ని పెంపొందించేం దుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని అన్నారు. అన్ని మతాల ప్రజలు స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. తాండూర్ ప్రాంతాన్నిఅభివృద్ధి చేయడమే లక్ష్యం అని తెలిపారు. వేడుకలలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, ఈద్గా కమిటీ అధ్యక్షు లు యూసుఫ్ ఖాన్, ఉపా ధ్యక్షులు ఫసీయోద్దీన్, ప్రధాన కార్యదర్శి నసిర్ అహ్మద్, ట్రెజరర్ ఫకృద్దీన్ కైసర్, జాయింట్ సెక్రటరీ జుబేర్ లాల, సభ్యులు మోసిన్ ఖాన్, ముస్తఫా పటేల్, జిలాని, వసీం అక్రమ్, ఇమ్రాన్ అధికంగా ముస్లింలు పాల్గొన్నారు.

