సంపద సృష్టికర్తలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఏది.CITU ప్రజా సంఘాల డిమాండ్
తాండూర్ :అగ్నిజ్వాల ప్రతినిధి
తాండూర్ పట్టణం లో సీఐటీయు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంపద సృష్టికర్తలైన కార్మికులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఏదని *సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం వెంకటయ్య మాట్లాడుతూ* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక బడ్జెట్ పై
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రత్యక్ష పన్నులు పెంచి పరోక్ష పన్నులు తగ్గించి కార్మికులను న్యాయం చేయకుండా,పెట్టుబడి దారుల సంపద పై పన్నును తగ్గించడమేమిటని ప్రశ్నించారు సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గం 58 కోట్ల మంది ఉన్నారని,50 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ లో కేవలం 3600 కోట్లు మాత్రమే కార్మిక శాఖకు కేటాయించడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు కార్మిక వర్గానికి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించడం వల్ల దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ముందుకు వెళ్తుందని కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం గురించి కాకుండా అంబానీలు ఆదానిలపై ఆధారపడి బడ్జెట్ ను ప్రవేశపెట్టారని విమర్శించారు స్థూల జాతీయోత్పత్తిలో అత్యధిక వాటా అసంఘటితరంగ కార్మికుల నుంచి వస్తున్నదని కానీ వారి రక్షణ కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు శ్రామిక పేదల కొనుగోలు శక్తిని కుదించడం వలన సాధారణంగా వారు కొనుగోలు చేసే సరుకులకు డిమాండ్ తగ్గుతుందన్న ఇంకిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు ఇప్పటికే ఎనిమిది గంటల పని దినం స్థానంలో 12 గంటల పని దినాన్ని పెంచారని, పని గంటల సమయాన్ని పెంచుతున్నారు తప్ప కార్మికుల ఆదాయాలు మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధిని కల్పించే చర్యలు బడ్జెట్ లో ఏమాత్రం లేవని విమర్శించారు గత బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86 వేల కోట్ల కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో 3000 కోట్లు తగ్గించారని అన్నారు ఉపాధి హామీ అంటే బిజెపి దృష్టిలో ఆదాని అంబానీ లాంటి కార్పొరేటర్లకు ఉపాధి కల్పించడమేనా అని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి న్యాయస్థానాలు వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలు మాఫీ ఎందుకు చేశారని ప్రశ్నించారు పెట్టుబడిదారులకు ఇస్తే రాయితీలు పేదలకు ఇస్తే దేశానికి భారం ఎలా అవుతుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను కార్మిక వర్గం అర్థం చేసుకొని కేంద్రం బడ్జెట్ ను సవరించేంత వరకు జరిగే పోరాటాలలో కార్మిక వర్గం భాగస్వాములై ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు కే చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు