* హై జంప్ లో నేషనల్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధించిన నవనీత
తాండూర్ :అగ్ని జ్వాలా ప్రతినిధి :
తాండూర్ ఇంద్రనగర్ 5వ వార్డ్ లో గల నవనీత అనే అమ్మాయి నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ లో age 35 to 40 విభాగంలో 1.25 హై జంప్ లో నేషనల్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అందుకు ఈరోజు తాండూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & బీవీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ నవనీత ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఇక ముందు ఇండోనేషియాలో జరిగే ఇంటర్నేషనల్ అథ్లెటిక్ లో అమ్మాయికి కావాల్సిన అన్ని సౌకర్యాలు బీవీజీ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవనీత కుటుంబ సభ్యులు,వార్డ్ పెద్దలు,మహిళలు,వార్డ్ యువ నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

