హత్యా కేసులో నిందితునికి జీవిత ఖైదు

 

హత్యా కేసులో నిందితునికి జీవిత ఖైదు – జిల్లా ఎస్పీ K.నారాయణ రెడ్డి,IPS.

 

తాండూర్: అగ్నిజ్వాల ప్రతినిధి :

2023 సంవత్సరం లో తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యా నేరం లో నిందితునికి ఈ జీవిత ఖైదు మరియు 1000 రూపాయల జరిమానా, నేరస్థుడు ఒకవేళ 1000 రూపాయల జరిమానా కట్టకపోతే 6 నెలల సాధారణ జైలు శిక్ష విదిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది అని జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి తెలిపినారు. అట్టి కేసుకు సంబందించిన వివరాలు క్రింది విదంగా ఉన్నాయి.

2023 సంవత్సరం లో తాడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాం పేట్ లో నివాసం ఉండే బార్యభర్తలలో (బార్య అనసూయ మృతురాలు)ను భర్త మ్యాతరి శాంత కుమార్ తాగి వచ్చి కొట్టి చంపినాడు అని మృతురాలి అన్న మొంగరగని శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి తాండూర్ టౌన్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి కేసు నమోదు చేయగా , ప్రస్తుత తాండూర్ ఎస్‌హెచ్‌ఓ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఛార్జ్ షీట్ ను సమర్పించగా వాదోపవాదనలు విన్న గౌరవ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు నిందితుడు మ్యాతరి శాంత్ కుమార్ కు జీవిత ఖైదు మరియు 1000 రూపాయల జరిమానా, నేరస్థుడు ఒకవేళ 1000 రూపాయల జరిమానా కట్టకపోతే 6 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలిపినారు.

ఇట్టి కేసులో నిందితునికి శిక్ష పడే విదంగా పని చేసిన పీపీ శ్రీ పి.సుధాకర్ రెడ్డి, మొదటి ఐఓలు కె.రాజేందర్ రెడ్డి,ప్రస్తుత IO సంతోష్ కుమార్,ప్రస్తుత డి‌ఎస్‌పి బాలకృష్ణ రెడ్డి, CDO సలీం పాషా, బ్రీఫింగ్ ఆఫీసర్లు బి.వీరన్న లకు జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *