తిరుపతి లో సునితమ్మ సంక్రాంతి
తాండూర్: అగ్నిజ్వల ప్రతినిధి :
మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జీ, మాజీ హ్యట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేంధర్ రెడ్డి గారు తిరుపతి పీవీపురంలో సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. సునితమ్మ వియ్యంకురాలు ఫార్మ్ హౌస్ లో కూతురు మనీషారెడ్డి, వియ్యంకురాలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటు జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గు
వేశారు. తోటలోని మామిడి, కొబ్బరి తోటల్లో కలియతిరుగుతూ ఫోటోలు దిగారు. అందరూ కలిసి ఫార్మ్ హౌస్ సమీపంలోని శ్రీ లక్ష్మీనర్సింహా స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

