తాండూరు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ డైరీ ఆవిష్కరణ
ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ కి అన్ని డిపార్ట్మెంట్ల మాదిరిగా పెన్షన్స్ స్కీం అమలు చేయాలి
సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి
తాండూర్ అగ్నిజాల ప్రతినిధి
తాండూరు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ 2025 డైరీ ఆవిష్కరించడం జరిగింది. ఈ డైరీ ఆవిష్కరణలో సంగం లీగల్ అడ్వైజర్ న్యాయవాదిగోపాల్ రీజినల్ సెక్రెటరీ జబ్బర్ జాయింట్ సెక్రెటరీ వీరన్న ఉపాధ్యక్షులు ఎంకే రెడ్డి ఎం లక్ష్మప్ప సలహాదారు సంజయ్ కుమార్ ప్రతినిధులు శాంతి కుమార్ నారాయణ పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ కి అన్ని డిపార్ట్మెంట్ల మాదిరిగా పెన్షన్స్ స్కీం అమలు చేయాలని మరియు వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 2017 పిఆర్సి ప్రకారము ఆ తర్వాత రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ పిఆర్సి ఏరియాస్ ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

