* పంచాయతీ ఉద్యోగ కార్మికుల మెడకు ఉరితాడుగా ఉన్న మల్టీ పర్పస్ వర్కర్ విధానం
* కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
తాండూర్ :అగ్ని జ్వాలా ప్రతినిది
తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేపు అనగా 17వ తారీకు మంగళవారం నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గ్రామపంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలి ఈరోజు తాండూర్ మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మిక సమస్యలపై ఒక ప్రకటనలో పేర్కొన్నారు వారు మాట్లాడుతూ 17- 12- 2024న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరడం జరిగింది అదేవిధంగా ఈ నెల 20 తర్వాత ఏరోజు నుండైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని వారు అన్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ దానసరి సీతక్క వినతి పత్రం సమర్పించాం అని అన్నారు ముఖ్యంగా పంచాయతీ ఉద్యోగ కార్మికుల మెడకు ఉరితాడుగా ఉన్న మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దుకై 51 జీవో సవరణ కారోబార్ బిల్ కలెక్టర్ల ప్రత్యేక స్టేటస్ రెండో పి ఆర్ సి అమలలో కార్మికులను పరిగణలోకితీసుకోవాలని రాష్ట్రంలో ఇప్పటివరకు బకాయి పడిన వేతనాలు ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి నేరుగా చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అందర్నీ పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్లతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా. ఇందిరాపార్కులో ఈనెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా “బహిరంగ సభ ‘ జరుగుతుంది ఈ సమావేశంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నందున రాష్ట్రంలోని గ్రామపంచాయతీ లో పనిచేయుచున్న అన్ని తరగతుల సిబ్బంది మరియు కారోబార్లతో సహా హాజరై విజయవంతం చేయాలని వారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సిములు వెంకట్ అంబరప్ప పాల్గొన్నారు

