వికారాబాద్ జిల్లాలో ఆసక్తి గలవారు పాల్గొనవచ్చు
రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూజారి మల్లప్ప ఆధ్వర్యంలో ప్రజకళాల పరిరక్షణ లో భాగంగా ఒగ్గుడోలు శిక్షణ శిబిరం
తాండూర్ : అగ్నిజాల ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు శ్రీ మల్లికార్జున ఒగ్గుకళా సేవసమితి,నాందార్ పూర్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూజారి మల్లప్ప ఆధ్వర్యంలో ప్రజకళాల పరిరక్షణ లో భాగంగా ఒగ్గుడోలు శిక్షణ శిబిరం
దీ 18-12-2024 బుధవారం నాడు ఉదయం 10:25నిమిషాలకు గ్రామం,,ఎంకేపల్లి మండలం,,యాలాల జిల్లా,, వికారాబాద్ లో ప్రారంభం కానుంది.తెలంగాణ ప్రభుత్వం భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు SRI MAMIDI HARIKRISHNA గారి అపూర్వ సహకారంతో తాండూర్ నియోజకవర్గం కురుమ సంఘం ప్రోత్సహంతో ఈ శిక్షణ శిభిరం 21రోజుల పాటు నిర్విరామంగా రోజుకు 10గంటల పాటు కొనసాగుతుంది.
భాషా సాంస్కృతిక శాఖ ఈ శిక్షణ శిభిరంలో పాల్గొనడానికి 100మంది విద్యార్థులకు అవకాశం కల్పించింది. 32రకాల అడుగులు,దారువులు, విన్యాసాలతో కూడిన ప్రదర్శన 2025 జనవరి 07తేదీ నాడు ముగింపు ఉత్సవంలో బాల ఒగ్గులు ప్రదర్శించనున్నారు. ప్రధాన శిక్షకులుగా ఒగ్గు బీరు శిక్షకులుగా శివ కుమార్,రాఘవేందర్,ఒగ్గు మల్లేష్ పాల్గొననున్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూజారి మల్లప్ప,ఎంకేపల్లి పూజారి కిష్టప్ప,గౌతపూర్ పూజారి చంద్రప్ప,అగ్గనుర్ పూజారి మల్లప్ప,ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పూజారి శాంతప్ప,ఉపాధ్యక్షుడు పూజారి శంకరప్ప,ప్రధానకార్యదర్శి ఒగ్గుబీరు,కథల కిష్టప్ప,జిల్లా సలహాదారుడు నాగులపల్లి నరసింహ,తాండూర్ టౌన్ అధ్యక్షుడు మరాఠీ నర్సింలు,తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగరం జగదీష్,ఉపాధ్యక్షుడు పూజారి పాండు,గౌరవ అధ్యక్షుడు చీమల నర్సింలు,తాండూర్ mdl అధ్యక్షుడు జినుగుర్తి నర్సింలు, కుర్వ బాలు, హన్మయ్య sir,గౌతపూర్ వెంకటయ్య,సాయి పూర్ హనుమంతు, భాసుపల్లి మల్కాప్ప,రవి,రాములు,యాదయ్య తదితర కులబంధావులు పాల్గొన్నారు….

