–వికారాబాద్ జిల్లా తైక్వాండో
ప్రధాన కార్యదర్శి మాస్టర్ మనోహర్, నారాయణ పెట్ జిల్లా కోస్గి కోచ్ వెంకటయ్య
తాండూర్:అగ్నిజ్వాల ప్రతినిధి :ఆత్మరక్షణకు తైక్వాండో క్రీడ దోహ దపడుతుందని
వికారాబాద్ జిల్లా తైక్వాండో
ప్రధాన కార్యదర్శి మాస్టర్ మనోహర్, నారాయణ పెట్ జిల్లా కోస్గి కోచ్ వెంకటయ్య తాండూర్ పట్టణంలోని శివమ్ స్కూల్ లో
తైక్వాండో క్రీడాకారులకు ఎల్లో, గ్రీన్, బ్లాక్ తదితర బెల్ట్ లు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించ డం సంతోషకరమని. అదేవిదంగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గెలుపొంది తాండూర్ కి, వారి తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకంక్షించారు. ప్రతినిత్యం తైక్వాండో ని చేయడం వల్లన చురుకుగా, ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. ముఖ్యంగా బాలికలకి, మహిళలకు ఈ క్రీడా తనను తాను రక్షించుకునేందుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో తైక్వాండో క్రీడా కారులు కోచ్ లు ప్రశాంత్ .సోహల్ .కార్తీక్ .ఇబ్రహీం .వారి తల్లితండ్రులు, సీనియర్ జర్నలిస్ట్ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.