రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముర్ము గారికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ధనసరి అనసూయ సీతక్క స్వాగతం పలికారు.
నగర మేయర్ విజయలక్ష్మి గద్వాల, ప్రభుత్వ సలహాదారు (ప్రొటొకాల్) హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ శ్రీ జితేందర్, త్రివిధ దళాలకు చెందిన అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.