రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్ ప్రభుత్వం
రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపు
అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి
వడ్లు, పత్తి కొనుగోలు ల్లో దళారులను నియంత్రించాలి
: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రైతులను నిండా ముంచుతున్నారని పాశం పద్మ అన్నారు. ఎస్ కే యం కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నవంబర్ 18 న జరగనున్న రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వికారాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఎం. వెంకట్ అధ్యక్షతన తాండూరులో నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సురేష్ కుమార్ గత కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు బోగస్ మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం దుర్మార్గమన్నారు, రైతు భరోసా వస్తుందని ఆశతో అప్పులు తీసుకువచి వ్యవసాయానికి పంట పెట్టుబడి పెట్టారని రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు, రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వకపోతే తెచ్చిన అప్పులు ఏ విధంగా కట్టాలో అనే అయోమయ పరిస్థితిలో రైతులు ఉన్నారన్నారు, ఏ వడ్లకైనా 500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు,వ్యవసాయ మార్కెట్ లో రాష్ట్ర పాలకులు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు పంటలకు మద్దతు ధరలతో పాటు బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశ్య పద్మ మాట్లాడుతూ
మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ లను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు,
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించవద్దని గ్రామీణ ఉపాధి హామీ పథకం లో రోజువారి వేతనం 600 రూపాయలు పెంచాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు, నవంబర్ 18 వ తేదీన జరుగుతున్న సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు .రైతు కార్మిక ప్రజా వ్యతిరేక కేంద్ర పాలకుల విధానాలను ఓడించటానికి సమాయత్తం కావాలని కోరారు.
రైతుబంధు రుణమాఫీ పంటలకు బోనస్ వెంటనే అమలు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలున్న వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుగ్గప్ప , పుష్ప, గూడెం రాములు, నస్కంటి లాలయ్య, మొగిలి అనంతయ్య , బడంపల్లి బాబు, ఇప్పలగడ్డ హనుమంతు, ఏం. సావిత్రమ్మ, , తదితరులు పాల్గొన్నారు.

