. వరి కొనుగోళ్లపై మంత్రులతో విడియో కాన్ఫరెన్స్
. మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
తాండూర్ :అగ్ని జ్వాలా ప్రతినిధి
వరి కొనుగోలు పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే BMR
రాష్ట్ర నీటిపారుదల & పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు పౌరసరఫరాల శాఖ వారు వడ్ల కొనుగోలు అంశం పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ…
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మిలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం సేకరణ జరుగుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లతో ఎదురవుతున్నా ఇబ్బందులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు