కురువ సహోదరులకు ఎస్సీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే 

కురువ సహోదరులకు ఎస్సీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే 
తాండూర్ ప్రాంతంలోని కురువ కులస్తులు అందరు మా దారి లేదా మాదాసి కురువ కులస్తులే
వీళ్ళందరూ షెడ్యూల్డ్ కులాల జాబితాలోనికి వస్తారు.
 తాండూరు అగ్నిజ్వల ప్రతినిధి    ప్రాంతంలోని కురువ సహోదరులరౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కురువ సంఘం రాష్ట్ర నాయకులు రంగన్న సత్తయ్య బంగారు పర్వతాలు మొదలగువారు పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా కురువ సంఘం తాండూరు నాయకులు న్యాయవాది గోపాల్ ప్రసంగిస్తూ సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా కురువ కులస్తులను షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలో ప్రభుత్వం చేర్చడం జరిగిందని దీని ప్రకారం కురువ కులస్తులకు Sc కుల సర్టిఫికెట్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఇక్కడున్న రెవెన్యూ అధికారులు మాత్రం కురుమ అని పేర్కొంటూ బిసి బి సర్టిఫికెట్ ఇస్తున్నారని ఇవి అన్యాయమని అధికారులు తమ నిర్లక్ష్యాన్ని విడనాడి సరియైన విచారణ చేసి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని కలెక్టర్ నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కురువ కులస్తులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఇట్టి అన్యాయానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు నిర్మించి తమ హక్కును సాధించుకుంటామని చెప్పారు.
రంగన్న మాట్లాడుతూ కురవాలందరు కూడా ఐక్యత ఐక్యమత్యంతో పోరాటం చేసి తమ హక్కును సాధించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో SVR హాస్పిటల్ డాక్టర్ రమణ గారు శ్రీశైలం ధనరాజ లాలప్ప మొదలగువారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కే నరసింహ అధ్యక్షత వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *