*ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి – తిమ్మాయపల్లి పై ఎర్ర హనుమంతు విజ్ఞప్తి
*పైలట్‌గా ఎంపికై కూడా నిలిచిపోయిన తిమ్మాయపల్లి అభివృద్ధి
రెండేళ్లు గడిచినా తిమ్మాయపల్లిలో అభివృద్ధి జాడలేదు!
*రెండేళ్లు గడిచినా తిమ్మాయపల్లిలో అభివృద్ధి జాడలేదు!
*పైలట్ ప్రాజెక్టు గ్రామం తిమ్మాయపల్లి అభివృద్ధి ఎక్కడ? – ఎర్ర హనుమంతు ప్రశ్న
తాండూర్,manasa news ప్రతినిధి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టు గ్రామా అభివృద్ధి పనులు ఏమయ్యాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తాండూర్ నియోజకవర్గ నాయకులు ఎర్ర హనుమంతు ప్రశ్నించారు.తిమ్మాయపల్లి గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై రెండేళ్లు పూర్తయినప్పటికీ గ్రామంలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు సర్పంచ్ గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.రెండేళ్లు గడిచినా గ్రామంలో కనీసం ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తికాలేదని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ భవనం, మురుగు కాలువలు, సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు.ఇతర మండలాల్లో ఎంపికైన పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుండగా, తిమ్మాయపల్లిలో మాత్రం అభివృద్ధి పనులు నిలిచిపోయిన పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. గ్రామ స్థాయిలో అధికార పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం కూడా అభివృద్ధికి ఆటంకంగా మారిందని అన్నారు.అర్హత ఉన్న లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు మంజూరు చేసే విషయంలో కూడా నిర్లక్ష్యం జరుగుతోందని, కొంతమంది అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని అర్హుల పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పటికీ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి విషయాలను తీసుకెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి పైలట్ ప్రాజెక్టు గ్రామమైన తిమ్మాయపల్లి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎర్ర హనుమంతు తెలిపారు.

