“ 
“కుల దురహంకారానికి చెక్ పెట్టాలి… కొమ్మెర నిందితులకు ఉరి శిక్ష విధించాలి!”
*“పసికందు మృతి కలచివేసింది… హత్య కేసు నమోదు చేయాలి!”
*“కుమ్మెర ఘటనపై ఆగ్రహం… నిందితులకు కఠిన శిక్ష తప్పదు!”
*కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి
*పసికందు మృతికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయాలి
*బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలి
* జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
Manasa news ప్రతినిధి :నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో అగ్రకులాల దురాహంకారంతో బీసీ రజక కుటుంబానికి చెందిన గణేష్–చంద్రకళ దంపతులపై జరిగిన అమానుష దాడి ఫలితంగా రెండు నెలల పసికందు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, వారిపై హత్య కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇటువంటి కుల దురహంకార దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కొమ్మెర ఘటనలో నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని సూచించారు. కేసుకు సంబంధించిన విచారణ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా జరిపి, బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.

