చట్టం అందరికీ సమానమే !

 

*అవగాహన పెరిగితేనే సమాజంలో శాంతి భద్రతలు!

*ప్రజల్లో న్యాయ చైతన్యం కోసం తాండూర్‌లో మహా సదస్సు!

*హక్కులు తెలుసుకోండి… న్యాయం మీ వెంట ఉంటుంది!

*చట్టాలపై అవగాహనతోనే నేరాలకు చెక్

*చట్టం అందరికీ సమానం: న్యాయవాదుల స్పష్టంచట్టం అందరికీ సమానం!

*రాజీవ్ ఇంద్రమ్మ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు

తాండూర్:manasa news ప్రతినిధి :తాండూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తాండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు రాజీవ్ ఇంద్రమ్మ కాలనీలో ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్యానల్ న్యాయవాదులు మఠం చంద్రశేఖర్, జిలాని, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చట్టాలపై ప్రజలకు సరైన అవగాహన ఉన్నప్పుడే సమాజంలో నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం అవసరమని తెలిపారు.సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడిందని తెలిపారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, అందరికీ సమానంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు.ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఆంజనేయులు, కోర్టు సిబ్బంది ప్రేమ్, ఉపాధ్యాయులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *