Manasa news , ప్రతినిధి :యాలాల
బానాపూర్ గ్రామంలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన
గ్రామ శ్రేయస్సు, ప్రజల ఐక్యతకు ప్రతీకగా బానాపూర్ గ్రామంలో ఐదు రోజుల పాటు నిత్య పూజలు, హోమాలు, భజనల మధ్య బొడ్రాయి ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.ఈ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ దేవాలయం లో గజస్థంభం కూడా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు రోజుల పాటు సాగిన ఈ మహోత్సవంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమాలు నిర్వహించగా, గ్రామస్తులు భారీగా హాజరై ఆశీర్వాదాలు పొందారు.వినాయక హాస్పిటల్ చైర్మన్ విట్టల్ నాయక్ ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజల ఐక్యత కోసం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత అవసరమని తెలిపారు.గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా అన్నదానం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

