దాన వంతుడానుకొని రోజు కూలిని కలిసింది

manasa news :ప్రతినిధి

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం… వివాహితకు చేదు అనుభవం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోషల్ మీడియా పరిచయం కారణంగా ఓ వివాహిత మహిళ మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తిని ధనవంతుడని నమ్మి ఏపీకి వచ్చింది. అయితే అతను దినసరి కూలీ అని తెలిసి షాక్‌కు గురైంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మహిళను సురక్షితంగా గుర్తించి కుటుంబానికి అప్పగించారు. కుటుంబ సభ్యుల నచ్చజెప్పడంతో ఆమె తిరిగి ఇంటికి చేరింది.

సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.