తాండూరు డివిజన్ లో అన్ని విద్యాసంస్థల బంద్ విజయవంతం

*విద్యాసంస్థల బంద్ విజయవంతం

తాండూరు డివిజన్ లో అన్ని విద్యాసంస్థల బంద్ విజయవంతం

 అగ్నిజాల ప్రతినిధి: తాండూర్

తాండూరు : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లో భాగంగా తాండూరు డివిజన్ లో బంద్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ,SFI తాండూరు డివిజన్ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పి తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందనీ అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి దిక్కులేడని తక్షణమే నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనీ, పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలనీ అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు కేటాయించాలనీ కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలనీ,సంక్షేమ హాస్టల్ తో పాటు గురుకులాలకు సొంతభవనాలు నిర్మాణం చేయాలి, ప్రతి మండలంలో గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి, విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలనీ,2020 నూతన జాతీయ విద్యా విధానాన్నీ తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని అన్నారు.ఈ బంద్ కు సహకరించిన ప్రైవేట్, గవర్నమెంట్ పాటశాల లు ,కళాశాలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కమిటీ సభ్యులు చరణ్,గోపాల్,డివిజన్ కమిటీ సభ్యులు నరేష్,శేషి కుమార్,రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *